సీఎం అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ అని..నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే టి.రామ్మెహన్​రెడ్డి

సీఎం అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ అని..నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే టి.రామ్మెహన్​రెడ్డి
  • కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి సవాల్​

పరిగి, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి అల్లుడి కోసమే కొడంగల్​ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నారని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్​చేసిన వ్యాఖ్యలను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మెహన్​రెడ్డి ఖండించారు. నిరూపిస్తే 24 గంటల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేకుంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్​విసిరారు. ఈ మేరకు బుధవారం ఆయన వీడియో రిలీజ్​చేశారు. సీఎం రేవంత్​రెడ్డిని, కాంగ్రెస్​ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

కొడంగల్ ఏరియాలో ఇండస్ట్రీస్​ఏర్పాటుకు 600 ఎకరాల భూమిని సేకరించామని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భూసేకరణ జరిగిందని తెలిపారు. ఇండస్ట్రీస్​ఏర్పాటుతో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, 200 ఎకరాల గ్రీన్ ఏరియా ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ గ్రీన్ ప్రాజెక్టులను మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. సిద్దిపేట, సిరిసిల్ల మాదిరిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఇతర వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవద్దా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలు కేసీఆర్​ను, కేటీఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ లో కలిపితే..  ఉద్యమించి చార్మినార్ జోన్ లో కలిపేలా చేశామన్నారు. ప్రాణహిత చేవెళ్ల, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్​ఈ ప్రాంతంలోని ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.