
- ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
పరిగి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి మినీ స్టేడియం గ్రౌండ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అర్హులకు రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత ఇందిరమ్మ కమిటీలు తీసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులే కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలన్నారు.
అనంతరం రూ.29 లక్షలతో పరిగి- కొత్తచెరువు పునరుద్ధరణ, రూ. 120 కోట్ల చొప్పున పరిగి– - వికారాబాద్, పరిగి–- షాద్నగర్ నాలుగు లైన్ల రోడ్ల అభివృద్ధి, రూ.100 కోట్లతో ఘడ్ సింగాపూర్ – రంగారెడ్డి పల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్, డీఆర్డీఏ పీడీ, మార్కెట్ చైర్మన్ లు, పీఎసీఎస్ చైర్మన్లు , తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.