- దంపతులను అదుపులోకి తీసుకున్న పరిగి పోలీసులు
- బంగారు, వెండి నగలు రికవరీ
పరిగి, వెలుగు: ఆలయాల్లో హుండీలు దొంగతనం చేస్తున్న దంపతులను పరిగి పోలీసులు పట్టుకున్నారు. గురువారం పరిగి సర్కిల్ ఆఫీస్‌లో డీఎస్పీ కరుణ సాగర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని రాగాపూర్ గేట్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన దుద్యాల వెంకటయ్యను విచారించారు. తన భార్యతో కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు అతడు అంగీకరించాడు.
ALSO READ :ఎల్‌ఐసీ నుంచి సేవింగ్స్, ఇన్సూరెన్స్ ప్లాన్
వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామానికి చెందిన దుద్యాల వెంకటయ్య (34), భార్య అరుణతో కలిసి కొన్ని నెలలుగా వికారాబాద్ జిల్లాతో పాటు వనపర్తి, నారాయణపేట్ జిల్లాలో మొత్తం 19 దొంగతనాలు చేశాడని తేలింది. నిందితుల నుంచి ఒక షిఫ్ట్ కారు, హోండా షైన్, ఒక సెల్ ఫోన్, 3.3 తులాల బంగారం, 2.56 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. వీరు ఎక్కువగా దేవాలయాల్లోని హుండీలను దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు.నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.