ఏపీ సీఎం జగన్‌ను అంబానీ కలిసింది ఇందుకేనా?

ఏపీ సీఎం జగన్‌ను అంబానీ కలిసింది ఇందుకేనా?

   పరిమళ్ నత్వానీకి సీట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయం

    పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్యరామిరెడ్డికి చాన్స్

      పేర్లు ఖరారు చేసిన వైసీపీ

అమరావతి, వెలుగు:  జార్ఖండ్​ నుంచి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడైన పరిమళ్​ నత్వానీ మూడో సారి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముఖేష్​ అంబానీ సిఫారస్​తో నత్వానీకి సీటు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్​ నిర్ణయించారు. సోమవారం ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. నత్వానీకి రాజ్యసభ సీటు కోసం ఇటీవల అంబానీ సీఎం జగన్ ను కలిశారు. నత్వానీతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్  చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డికి అవకాశం దక్కింది. నలుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. మండలిని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడంతో వారు మంత్రి పదువులు కోల్పోతారు. దీంతో ఇద్దరిని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో కీలకంగా పనిచేసి పార్టీ ఎమ్మెల్యేల గెలుపుకు కృషి చేసిన అయోధ్య రామిరెడ్డికి చాన్స్ దక్కింది.  2008, 2014లో రాజ్యసభకు ఎంపికైన పరిమళ్ నత్వానీ ఇప్పుడు మూడోసారి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు.  ఆయన గతంలో రిలయన్స్ గ్రూప్
కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు.