
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల రిలేషన్ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వైరలవుతున్నాయి. వీరింట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనికి తోడు ఆప్ నేత ఒకరు మీరు కలకాలం కలిసి జీవించాలంటూ ఆశీర్వచనాలు ఇస్తూ వీరి ఫొటోలను ట్వీట్ చేశాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే ఈ జంట ఏప్రిల్ 10న నిశ్చితార్థం జరుపుకోనున్నారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. దిల్లీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను ప్లాన్ చేశారట.
ఎయిర్ పోర్టులో పరిణీతిని చుట్టుముట్టిన మీడియా ఇదే విషయం ఆమె దగ్గర ప్రస్తావించారు. దీంతో ఆమె సిగ్గుల మొగ్గైంది. ఆ తర్వాత ‘నేను లండన్ వెళ్తున్నాను కావాలంటే బోర్డింగ్ పాస్ చూపిస్తాను’ అంటూ అక్కడి నుంచి చెక్కేసింది. అయితే, ఇప్పటి వరకూ తమ బంధంపై వీరు నోరు విప్పలేదు. కానీ, సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం, రెస్టారెంట్లు, ఎయిర్ పోర్టుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరగడం వంటివి చూసి నెటిజన్లు మాత్రం పెళ్లి విషయం కన్ఫర్మ్ చేసేస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన పరిణీతి.. పరేషాన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
https://www.instagram.com/reel/CqreO6YKvim/?utm_source=ig_web_copy_link