బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట..త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఈ నెల సెప్టెంబర్ 23 న ప్రీ వెడ్డింగ్ ,24 న మ్యారేజ్ జరగనుంది. అందుకు మొదట ప్రీ వెడ్డింగ్ లీలా ప్యాలెస్ లోను, వివాహ వేడుక కొరకు ది ఒబెరాయ్ ఉదయ్ విలాస్ లో ఘనంగా జరుగనుంది. ఇంకా వీరిద్దరీ మ్యారేజ్ కి రెండు రోజులు టైం ఉండగా..లేటెస్ట్ గా న్యూ ఢిల్లీలోని గురుద్వారాలో అర్దాస్ కీర్తనలో పాల్గొని ఆశీర్వాదం పొందడం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం వీరి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ జంట మే 13న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇన్నాళ్ళకి ఈ జంట ఒకటవుతుండటంతో బాలీవుడ్ లో సంబరాలు షురూ కానున్న్నాయి. ఇక ఇప్పటికే వీరి మ్యారేజ్ రిసెప్షన్ కొరకు బాలీవుడ్ నుంచి ప్రముఖులందరికీ ఇన్విటేషన్ కూడా అందినట్టు సమాచారం. ఈ నెల (సెప్టెంబర్ 30 న) చండీఘడ్లో ఘనంగా రిసెప్షన్ వేడుకలు జరుగనున్నాయి.
ALSO READ : మనకు ఎన్నికలు ఎలా వచ్చినా.. ఎప్పుడొచ్చినా పర్వాలేదు : సీఎం జగన్
వీరిద్దరి మ్యారేజ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢీల్లి చీఫ్ మినిష్టర్ అరవింద్ కేజ్రీవాల్, ఇండియన్ పొలిటిషన్, సోషల్ వర్కర్ భగవంత్ మాన్ అటెండ్ కానున్నారు.వీరితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు రానున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి పరిణీతి చోప్రా కజిన్ బ్యూటీ ప్రియాంక చోప్ర, ఆమె భర్త నిక్ జోనాస్ తో పాటు పలువురు సినీ సెలెబ్రెటీస్ అటెండ్ కానున్నారు.