
- బ్యాన్‌తో రోహిదాస్ దూరం
పారిస్: ఒకప్పుడు ఎనిమిది గోల్డ్ మెడల్స్ నెగ్గిన చరిత్ర.. ఆ తర్వాత ఒక్క పతకం కూడా గెలవలేని పరిస్థితి.. కానీ టోక్యోలో బ్రాంజ్ మెడల్‌తో మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసిన ఇండియా హాకీ టీమ్ పారిస్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే సెమీస్‌లో వరల్డ్ చాంపియన్ జర్మనీపై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా1980 మాస్కో గేమ్స్‌కు ముందు ఉన్న ఘనమైన చరిత్రను మరోసారి రిపీట్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెమీస్‌లో గెలిస్తే ఇండియాకు కనీసం రజత పతకమైనా దక్కుతుంది. క్వార్టర్స్‌లో ఇండియా 10 మందితోనే ఆడినా 40 నిమిషాల పాటు బ్రిటన్‌ను వణికించిన తీరు అద్భుతం. ఇక పెనాల్టీ షూటౌట్‌లో గోల్ కీపర్ శ్రీజేష్ చూపిన తెగువ, తెగింపు మ్యాచ్‌కే హైలెట్. సరిగ్గా అలాంటి ఆటనే జర్మనీపై కూడా చూపెట్టాలని హాకీ వీరులు తహతహలాడుతున్నారు.
కానీ, గత పోరులో రెడ్ కార్డుకు గురైన కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవడం అతిపెద్ద లోటు. రోహిదాస్‌పై విధించిన రెడ్ కార్డు సస్పెన్షన్‌ను ఎఫ్‌ఐహెచ్ సమర్థించింది. దీంతో అతను సెమీస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫలితంగా ఇండియాకు ఓ పెనాల్టీ ఆప్షన్ మిస్సయ్యింది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై ఎక్కువ భారం పడనుంది. మిగతా వాళ్లు కూడా అంచనాలు అందుకోవాల్సి అవసరం చాలా ఉంది. మరోవైపు వరల్డ్ నాలుగో ర్యాంకర్ అయిన జర్మనీ అటాకింగ్ గేమ్ ఆడటంలో దిట్ట. షార్ట్ పాస్‌లతో బాల్‌ను ఎక్కువగా ఆధీనంలో ఉంచుకుంటారు. అయితే టోక్యో బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఇండియా.. జర్మనీపైనే గెలవడం కాన్ఫిడెన్స్ పెంచే అంశం. పారిస్ గేమ్స్‌కు ముందు కూడా ఇండియా ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్‌లు జర్మనీతోనే ఆడింది. కాబట్టి శక్తి మేరకు కష్టపడితే జర్మనీకి చెక్ పెట్టడం పెద్ద విషమేమీ కాబోదు. మరో సెమీఫైనల్లో స్పెయిన్.. నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.