జూలై 26 నుండి పారిస్ వేదికగా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడల్లో భారత్ దేశం తరుపున 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరి జాబితాను భారత ఒలింపిక్ సంఘం బుధవారం (జూలై 17) రిలీజ్ చేసింది. వీరితో పాటు ఒలింపిక్స్ క్రీడలకు 140 మంది సహాయ సిబ్బంది కూడా వెళ్తున్నట్లు ఐఓఏ వెల్లడించింది.
అథ్లెట్లతో పాటు పారిస్ వెళ్తున్న 140 మంది సహాయక సిబ్బందిలో 72 మంది ఖర్చులు మాత్రమే ప్రభుత్వం భరించనుంది. నిబంధనల ప్రకారం సహాయక సిబ్బంది సంఖ్య 67 మించకూడదు. దీంతో ఐదుగురు వైద్య బృందం, సహాయక సిబ్బంది 67 కలిపి మొత్తం 72 మందికి ప్రభుత్వం ఖర్చులు భరించనుంది.
20 క్రీడా విభాగాల్లో..
భారత అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో పాల్గొననున్నారు. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో ఒకొక్కరు పోటీపడుతుండగా.. టేబుల్ టెన్నిస్ (8), బ్యాడ్మింటన్ (7), రెజ్లింగ్ ( 6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6), గోల్ఫ్ (4), టెన్నిస్ (3), స్విమ్మింగ్ (2), సెయిలింగ్‌లో ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
1) ఆర్చరీ జూలై 25 - ఆగస్టు 4
2)అథ్లెటిక్స్ ఆగస్టు 1 - ఆగస్టు 10
3) బ్యాడ్మింటన్ జూలై 27- ఆగస్టు 5
4)బాక్సింగ్ జూలై 27-ఆగస్టు 10
5) గుర్రపు స్వారీ జూలై 30- ఆగస్టు 4
6)గోల్ఫ్ ఆగస్టు 1- ఆగస్టు 10
7)హాకీ జూలై 27-ఆగస్టు 8
8)జూడో ఆగస్టు 2-ఆగస్టు 2
9)రోయింగ్ జూలై 27-ఆగస్టు 3
10)సెయిలింగ్ ఆగస్టు 1-ఆగస్టు 6
11)షూటింగ్ జూలై 27-ఆగస్టు 5
12)స్విమ్మింగ్ జూలై 28-జూలై 29
13)టేబుల్ టెన్నిస్ జూలై 27-ఆగస్టు 10
14)టెన్నిస్ జూలై 27-ఆగస్టు 4
15)రెజ్లింగ్ ఆగస్టు 5-ఆగస్టు 11
16)వెయిట్ లిఫ్టింగ్ ఆగస్టు 7-ఆగస్టు 7
Paris 2024: Indian Olympic Athletics Squad
— SportsKPI (@SportsKPI) July 23, 2024
A 29-member Indian athletics team, led by men’s javelin throw defending champion Neeraj Chopra, will compete at the Paris 2024 Olympics.#paris2024 #athletics #neerajchopra #olympic #india pic.twitter.com/EbgYABQzgR