ఆశల అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. మరో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నీరజ్ గురి

ఆశల అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. మరో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నీరజ్ గురి

పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన దేశం నుంచి 117 మంది బరిలో నిలవగా.. అత్యధికంగా 29 మంది అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పోటీలో ఉన్నారు. టోక్యోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హిస్టరీ క్రియేట్ చేయడం దేశ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. చోప్రా వరుసగా రెండోసారి బంగారు పతకం నెగ్గాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకోగా.. అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో పతకం వస్తుందని ఇండియా ఆశిస్తోంది. 

మూడేండ్ల కిందటి వరకు  ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాది దీన స్థితి. ఎన్ని ఎడిషన్లలో ఎంత మంది ప్రయత్నించినా.. ఒక్క పతకం కూడా నెగ్గలేకపోయారు.  మిల్కా సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వంటి లెజెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే తమ కెరీర్ ముగించారు. అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకం ఇక కలే అనుకుంటున్న సమయంలో టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఏకంగా గోల్డ్ మెడల్ నెగ్గడంతో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సువర్ణాధ్యాయం మొదలైంది. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బంగారు పతకం తెచ్చిన దేశ తొలి క్రీడాకారుడిగా నీరజ్ చరిత్రకెక్కగా.. పారిస్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన పరుగు వీరులపై ఆశలు పెరిగాయి. నీరజ్ చోప్రా మరోసారి పసిడి పతక వేటలో నిలవగా.. మొత్తంగా 29 మంది అథ్లెట్లు 17 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ఇద్దరు తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. 

చోప్రాపై భరోసా

అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాకుండా ఈ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా మరో మెడల్ తెస్తాడని ఆశిస్తున్న వారిలో నీరజ్ చోప్రా ముందున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్ తర్వాత కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. 26 ఏండ్ల  చోప్రా 2022  ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  గోల్డ్ సాధించి పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు. అదే ఏడాది వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిల్వర్ నెగ్గిన జావెలిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీరుడు గతేడాది గోల్డ్ సాధించాడు. వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా  కైవసం చేసుకున్నాడు. డైమండ్ లీగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మెప్పించాడు. 2022 స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 89.94 మీటర్ల మార్కును అందుకున్నాడు. దాంతో ఒలింపిక్,  వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  టాప్ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్నాడు. కానీ, ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంగిట వరుస గాయాలు చోప్రాను ఇబ్బంది పెట్టాయి. పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఫోకస్ పెట్టిన అతను ఎంపిక చేసుకున్న టోర్నీల్లోనే బరిలోకి దిగాడు. దాంతో 50 వారాల పాటు తన ఖాతాలో ఉన్న వరల్డ్ నంబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కోల్పోయాడు. అయితే గత నెలలో ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన పావో నుర్మి గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ నెగ్గి పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పసిడి వేటకు సిద్ధమయ్యాడు.  టోక్యో గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ జాకబ్ వడ్లెజ్, ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ జూలియన్ వెబర్, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రోయర్ అర్షద్ నదీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గట్టి పోటీ ఎదురవనుంది. నీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కిషోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెనా కూడా బరిలో నిలిచాడు. ఆగస్టు 6న జరిగే క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ ఇద్దరి పోరు మొదలవనుంది.

అవినాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆశలు 

నీరజ్ చోప్రా తర్వాత అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతక ఆశలు  3000 మీటర్ల స్టీపుల్ ఛేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవినాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాబ్లే పై ఉన్నాయి.  పారిస్ డైమండ్ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8:09.91 టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  కొత్త  నేషనల్ రికార్డు సృష్టించిన  అవినాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. 2022  కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను  కెన్యా ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి  సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్ గెలిచాడు. దాంతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది.- 1998 నుంచి ప్రతి కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కెన్యాంకు చెందిన అథ్లెట్లే పోడియంను కైవసం చేసుకోగా రెండేండ్ల కిందట సాబ్లే చరిత్రను తిరగరాశాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటివరకు 10 నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డులను బ్రేక్ చేసిన 28 ఏండ్ల సాబ్లే  అదే జోరును కొనసాగిస్తే ఒలింపిక్ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక, 4x400 మీటర్ల మెన్స్  రిలే జట్టుకు కూడా పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకం నెగ్గే సత్తా ఉంది. టోక్యోలో   రిలే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  హీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3:00.25 నిమిషాలతో ఆసియా రికార్డును నెలకొల్పింది.  మొత్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ జట్టులోని   అనాస్, జాకబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ సారి కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ జట్టు ఫైనల్‌‌ చేరినా గొప్ప పెర్ఫామెన్సే కానుంది.

మన జ్యోతిపై అంచనాలు

అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు తొలిసారి పోటీపడనున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 మీటర్ల హార్డిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  యర్రాజీ జ్యోతి, 4x400 మీటర్ల రిలే జట్టు తరఫున దండి జ్యోతికశ్రీ పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. వీరిలో జ్యోతిపై అందరి దృష్టి ఉంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 మీ. హార్డిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఇండియా నుంచి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీపడుతున్న తొలి అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జ్యోతి ఇప్పటికే అరుదైన రికార్డు సృష్టించింది. ప్రస్తుతం దేశంలో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ స్ర్పింటర్ అయిన జ్యోతి ఇప్పటికే పలుమార్లు నేషనల్ రికార్డులను బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. తన పర్సనల్ బెస్ట్ 12.78 సెకండ్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగు పరుచుకోవడంపై జ్యోతి ఫోకస్ పెట్టనుంది. అత్యధిక పోటీ ఉండే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పతకం గెలిస్తే  జ్యోతి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తిరుగుండదు.