పారిస్ 2024 ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ లో పాల్గొనే అథ్లెట్లకు.. ఆర్గనైజింగ్ కమిటీ 2 లక్షలకు పైగా గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేసింది. ప్రథమ చికిత్స, ఆరోగ్య సేవల సమన్వయకర్త లారెంట్ డలార్డ్ మాట్లాడుతూ..ఒలింపిక్ విలేజ్‌లో ఉన్న 10,500 మంది అథ్లెట్లకు తగినన్ని ప్రొఫిలాక్టిక్‌లు అందించబడ్డాయని తెలిపారు. ఒలింపిక్ విలేజ్‌లోని వారికి 200,000 మగ కండోమ్‌లు.. 20,000 ఆడ కండోమ్‌లతో పాటు 10,000 ఓరల్ డ్యామ్‌లు అందుబాటులో ఉన్నాయి. పాఠ్యేతర పనికిమాలిన పనుల్లో పాల్గొనే వారు సురక్షితంగా ఉండేలా చూసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పారిస్ 2024 ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. జూలై 27 న ప్రారంభమైన ఈ టోర్నీలో నాలుగు రోజులు ముగిసాయి. చైనా, జపాన్, ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనాకు 8 గోల్డ్ మెడల్స్.. జపాన్ కు 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఫ్రాన్స్,గ్రేట్ బ్రిటన్ లకు ఆరు గోల్డ్ మెడల్స్ లభించాయి. భారత్ విషయానికి వస్తే రెండు కాంస్య పతకాలతో 37 వ స్థానంలో నిలిచింది.