
ఈ ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ ఓ షూటర్ రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. సింపుల్‌గా టీ షర్ట్ వేసుకొని, ఓ చేయి ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకొని, నెరిసిన జుట్టుతో పిస్టల్‌ను గురి పెట్టిన అతడిని ఒలింపిక్ హిట్‌మ్యాన్ అంటూ పొగుడుతున్నారు. ఆ షూటర్ పేరు యూసుఫ్ డికెక్. వయసు 51 ఏండ్లు. టర్కీకి చెందిన ఈ షూటర్ మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సెవాల్ టహ్రాన్‌తో కలిసి సిల్వర్ నెగ్గాడు.
ఒలింపిక్ షూటింగ్‌లో టర్కీకి ఇదే తొలి మెడల్. ఇదే ఈవెంట్‌లో మన మను, సరబ్‌జోత్ బ్రాంజ్ గెలిచాడు. అయితే, ఈ ఈవెంట్‌లో పోటీ పడ్డ వాళ్లంతా షూటింగ్ గేర్ (ప్రత్యేక డ్రెస్, ఓ కన్నుకు బ్లైండర్, చెవులకు ఇయర్ డిఫెండర్స్) ధరించారు. కానీ, డికెక్ ఇవేవీ లేకుండా తన కళ్ల జోడుతో సింపుల్‌గా పోటీ పడటమే వైరల్ అవ్వడానికి కారణమైంది.