Paris Olympic 2024: రితిక క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌తోనే సరి

Paris  Olympic 2024: రితిక క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌తోనే సరి
  • కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌ కైజీ చేతిలో ఓటమి
  • 6 పతకాలతోనే గేమ్స్‌‌‌‌‌‌‌‌ను ముగించిన ఇండియా
  • ఖాతాలో ఒక రజతం,ఐదు కాంస్యాలు

పారిస్‌‌‌‌‌‌‌‌: ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌ రితిక హుడా.. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్‌‌‌‌‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 76 కేజీ ఫ్రీస్టయిల్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఐపెరి మెడట్‌‌‌‌‌‌‌‌ కైజీ (కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌)తో శనివారం జరిగిన బౌట్‌‌‌‌‌‌‌‌లో రితికా 1–1 స్కోరుతో నిలిచింది. అయితే రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం చివరి పాయింట్‌‌‌‌‌‌‌‌ సాధించిన కైజీని విజేతగా ప్రకటించారు. ఆరు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన బౌట్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు రెజ్లర్లు బలమైన డిఫెన్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నారు. తొలి పీరియడ్‌‌‌‌‌‌‌‌లో రితిక ఒక పాయింట్‌‌‌‌‌‌‌‌ నెగ్గగా, రెండో పీరియడ్‌‌‌‌‌‌‌‌లో కైజీ ఒక పాయింట్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. చివరి టెక్నికల్‌‌‌‌‌‌‌‌ సుపీరియారిటీలో కైజీ మెరుగ్గా ఉండటంతో విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. కైజీ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరకపోవడంతో రితికాకు రెపిఛేజ్‌‌‌‌‌‌‌‌ ఆడే అవకాశం కూడా దక్కలేదు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో రితిక 12–2తో బెర్నాడెట్‌‌‌‌‌‌‌‌ నాగి (హంగేరి)ని ఓడించింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా అథ్లెట్లు ఆరు పతకాలతో సరిపెట్టుకున్నారు. ఇందులో ఓ రజతం, ఐదు కాంస్యాలు మాత్రమే ఉన్నాయి. టోక్యోలో సాధించిన ఏడు (ఒక గోల్డ్‌‌‌‌‌‌‌‌, ఒక సిల్వర్‌‌‌‌‌‌‌‌, 4 బ్రాంజ్‌‌‌‌‌‌‌‌) పతకాలను దాటలేకపోయారు.

గోల్ఫ్‌‌‌‌‌‌‌‌లో నిరాశే

ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా గోల్ఫర్లు అదితి అశోక్‌‌‌‌‌‌‌‌, దీక్షా దాగర్‌‌‌‌‌‌‌‌ కూడా నిరాశపర్చారు. శనివారం ముగిసిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ప్లే నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌ తర్వాత అదితి 290 పాయింట్లతో 29వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. దీక్ష 301 పాయింట్లతో 49వ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను సాధించింది. లైడియా కో (న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌), ఎస్తర్‌‌‌‌‌‌‌‌ హన్స్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ), లిన్‌‌‌‌‌‌‌‌ జియు జెనెట్‌‌‌‌‌‌‌‌ (చైనా) వరుసగా గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్నారు.