Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో షూటర్ల హవా.. ఫైనల్లో అర్జున్ బాబుటా

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో షూటర్ల హవా.. ఫైనల్లో అర్జున్ బాబుటా

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఔరా అనిపిస్తున్నారు. తొలి రోజు నిరాశపరిచినా.. రెండో రోజు పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఆదివారం(జులై 28)  జరిగిన మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పథకాన్ని అందించింది. మరోవైపు, ఇదే విభాగంలో భారత మహిళా షూటర్ రమితా జిందాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమితా 631.5 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది.

Also Read:-చరిత్ర సృష్టించిన మను భాకర్.. ఒలింపిక్స్‌లో పతకం

 తాజాగా, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బాబుటా ఫైనల్ చేరాడు. అతను 630.1 స్కోరుతో 7వ స్థానంలో నిలిచాడు.  ఇదే విభాగంలో పోటీ పడిన మరో షూటర్ సందీప్ సింగ్ 12వ స్థానంలో నిలిచాడు. పురుషుల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ సోమవారం జరగనుంది.