Paris Olympics 2024: పతకం చేజారింది.. ఆఖరి నిమిషంలో తడబడిన అర్జున్ బాబుటా

Paris Olympics 2024: పతకం చేజారింది.. ఆఖరి నిమిషంలో తడబడిన అర్జున్ బాబుటా

పురుషుల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో అర్జున్ బబుతా తృటిలో పతకాన్ని చేజార్చాడు. 208.4 పాయింట్లతో టాప్-4లో నిలిచి నిరాశ పరిచాడు. టాప్ -3లో నిలిచివుంటే పతకం వచ్చేది. ఆది నుంచీ రెండు.. మూడు స్థానాల్లో ఉన్న బబుతా.. చివరి రెండు షాట్లలో తడబడ్డాడు. నాలుగో స్థానంతో సరి పెట్టుకున్నాడు. 

కాగా, ఆదివారం జరిగిన మహిళల 10మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. పారిస్ గడ్డపై మెరిసి విశ్వక్రీడల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మరోవైపు, ఆమె సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ విభాగం ఫైనల్ మంగళవారం(జులై 30) జరగనుంది.

రమితా జిందాల్

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పతకం కోసం పోటీపడిన రమితా జిందాల్ ఫైనల్లో నిరాశ పరిచింది. 7వ స్థానంలో నిలిచింది.