Paris Olympics 2024:. పారిస్ ఒలింపిక్స్.. బెల్జియం చేతితో భారత్ ఓటమి

Paris Olympics 2024:. పారిస్ ఒలింపిక్స్.. బెల్జియం చేతితో భారత్ ఓటమి

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం(ఆగష్టు 1)పూల్-బిలో భాగంగా బెల్జియంతో జరిగిన పోరులో 2-1తో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ విజయంతో బెల్జియం అగ్రస్థానాన్ని చేరుకోగా.. భారత జట్టు రెండో స్థానానికి పడిపోయింది. ఎల్లో కార్డ్ కారణంగా భారత్‌ చివరి నిమిషాలలో 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది.

ALSO READ : Paris Olympics 2024: మెరిసిన స్వప్నిల్ కుసాలే.. షూటింగ్‌లో భారత్‌కు కాంస్య పతకం

నిజానికి తొలి అర్ధభాగంలో ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, మూడో క్వార్టర్ లో కోలుకున్న బెల్జియం రెండు గోల్స్ వేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత స్కోరు సమం చేయడానికి ఇండియా ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇండియా తరఫున ఏకైక గోల్ 18వ నిమిషంలో అభిషేక్  చేశాడు. 

కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం.. పూల్ స్టేజ్ లో ఆడిన నాలిగింటికిలోనూ విజయం సాధించింది. 12 పాయింట్లు వారి ఖాతాలో ఉన్నాయి. మరోవైపు, భారత్ ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్ ల్లో రెండింట గెలిచింది. ఒకటి డ్రాగా, బెల్జియం చేతిలో ఓటమిపాలైంది.

అంతకుముందు భారత్.. తమ తొలి మ్యాచ్‌‍లో న్యూజిలాండ్‌పై 3-2  విజయం సాధించింది. అనంతరం అర్జెంటీనాతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకోగా.. ఐర్లాండ్‌ను  2-0 తేడాతో చిత్తుచేసింది.