Paris Olympics 2024: పతకం తీసుకొస్తారా..? బాక్సింగ్‌లో భారత ఆటగాళ్లకు కఠినమైన డ్రా

Paris Olympics 2024: పతకం తీసుకొస్తారా..? బాక్సింగ్‌లో భారత ఆటగాళ్లకు కఠినమైన డ్రా

యావత్‌‌‌‌‌‌‌‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు నేడు తెరలేవనుంది. జూలై 27 నుంచి ఆగ‌స్టు 11 వ‌ర‌కు మొత్తం 17 రోజుల పాటు ఒలింపిక్స్ క్రీడ‌ల‌ను నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో భారత్ దేశం తరుపున ఈ సారి 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. బాక్సింగ్ విభాగానికి వస్తే మొత్తం ఆరుగురు బాక్సర్లు ఇండియా తరపున ఈ ఒలింపిక్స్ లో పాల్గొనున్నారు. అయితే ఈ సారి మన బాక్సర్లకు కఠినమైన డ్రా ఏర్పడింది. 

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్ మరియు లోవ్లినా బోర్గోహైన్ తమ తమ వెయిట్ కేటగిరీలలో కఠినమైన డ్రాలను ఎదుర్కొన్నారు. పతకం తీసుకొని వస్తారనే అంచానాలు ఉన్న వీరికి అదృష్టం కలిసి రాలేదు. నిశాంత్, అమిత్ నేరుగా రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించారు. మహిళల 50 కేజీల ఈవెంట్‌లో 32వ రౌండ్‌లో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌తో నిఖత్ తలపడనుంది. ఆమె తదుపరి రౌండ్‌కు చేరుకుంటే.. ఆసియా గేమ్స్ ఛాంపియన్ వు యు (చైనా) తో తలపడుతుంది. 

లోవ్లినా బోర్గోహైన్ విషయానికి వస్తే.. ఆమె మహిళల 75 కేజీల విభాగంలో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌తో రౌండ్ 16లో తలపడనుంది. ఈమె క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తే లోవ్లినా..చైనాకు చెందిన లి కియాన్‌తో తలపడనుంది. ఈమె రెండుసార్లు ఒలింపిక్ పతకం గెలవడంతో పాటు.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచింది. 

పారిస్ ఒలింపిక్స్ 2024 భారత బాక్సింగ్ ఆటగాళ్ల డ్రా :

మహిళలు 50 కేజీలు: నిఖత్ జరీన్ vs మాక్సీ కరీనా క్లోట్జర్ - రౌండ్ ఆఫ్ 32

మహిళల 54 కేజీలు: ప్రీతి పవార్ vs వో తి కిమ్ అన్హ్ - రౌండ్ ఆఫ్ 32

మహిళల 57 కేజీలు: జైస్మిన్ లంబోరియా vs నెస్తీ పెటెసియో - రౌండ్ ఆఫ్ 32

మహిళల 75 కేజీలు:  లోవ్లినా బోర్గోహైన్ vs సున్నివా హాఫ్‌స్టాడ్ - రౌండ్ ఆఫ్ 16

పురుషుల 51 కేజీలు:  అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబ - రౌండ్ ఆఫ్ 16

పురుషుల 71 కేజీలు:  నిశాంత్ దేవ్ vs జోస్ రోడ్రిగ్జ్ టెనోరియో - రౌండ్ ఆఫ్ 16