Paris Olympics 2024: మెడల్ కొట్టు.. కారు పట్టు: ఒలింపిక్ విజేతలకు బిలియనీర్ సూపర్ ఆఫర్

Paris Olympics 2024: మెడల్ కొట్టు.. కారు పట్టు: ఒలింపిక్ విజేతలకు బిలియనీర్ సూపర్ ఆఫర్

పారిస్ ఒలింపిక్ పతక విజేతలకు ప్రముఖ వ్యాపారవేత్త, జేఎస్ డబ్ల్యూ కంపెనీ చైర్మన్ సజ్జన్ జిందాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన ప్రతి భారత అథ్లెట్‌కు త్వరలో లాంఛ్ కానున్న ఎంజీ విండర్స్ కారును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జిందాల్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. 

విశ్వ క్రీడల్లో అంకితభావంతో ఆడి పతకం గెలిచిన వారి గొప్ప విజయానికి ఇది సరైన బహుమతి అని సజ్జన్ జిందాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు ఇండియా మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. ఈ మూడు మెడల్స్ షూటింగ్‍లోనే రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో స్టార్ షూటర్ మను భాకర్  బ్రాంజ్ మెడల్ గెల్చుకోగా.. ఇదే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్‌లో సరబ్ జిత్ సింగ్, మను భాకర్ జోడి  కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఇక ఎయిర్ రైఫిల్ 3 ప్రొజిషన్ 50 మీటర్ల వ్యక్తిగత విభాగంలో స్వప్నిల్ కుసాలే బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరు ముగ్గురు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరుఫున  పతకాలు సాధించారు. మరి కొన్ని ఈవెంట్లలో ఇండియాకు మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది.