Paris olympics 2024: వినేశ్ తీర్పు ఆగస్టు 13 కు వాయిదా

Paris olympics 2024:  వినేశ్ తీర్పు ఆగస్టు 13 కు వాయిదా

పారిస్‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌ వినేశ్‌‌‌‌‌‌‌‌ ఫొగాట్‌‌‌‌‌‌‌‌కు న్యాయం జరుగుతుందా? ఆమెకు  రజతం వస్తుందా? అనే విషయంపై సస్పెన్స్ మరింత కొలం కొనసాగనుంది. వినేశ్​  అనర్హత అప్పీల్‌‌‌‌‌‌‌‌పై తీర్పును కోర్టు ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఆర్బిట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ (కాస్‌‌‌‌‌‌‌‌) వాయిదా వేసింది. గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన రెండు రోజుల తర్వాత మంగళవారం కాస్ తమ తీర్పును బహిర్గతం చేస్తుందని ఇండోనియన్ ఒలింపిక్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. కాస్ శుక్రవారం ఇరువర్గాల వాదనలు విన్నది.  వర్చువల్‌‌‌‌‌‌‌‌గా జరిగిన విచారణను పూర్తి స్థాయిలో మరోసారి పరిశీలించిన తర్వాత తీర్పు చెప్పాలని కాస్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇద్దరు రెజ్లర్లకు రజతం ఎలా ఇస్తామని ఐవోసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌ బాచ్‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ కొనసాగుతోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కాస్‌‌‌‌‌‌‌‌ తన నిర్ణయాన్ని వెల్లడించొచ్చు.

ఆమె అందరి హృదయాల్లో ఉంటుంది: నీరజ్‌‌‌‌‌‌‌‌

వినేశ్‌‌‌‌‌‌‌‌ ఫొగాట్‌‌‌‌‌‌‌‌ అనర్హత అప్పీల్‌‌‌‌‌‌‌‌పై తీర్పు అనుకూలంగా వచ్చినా రాకపోయినా.. దేశం కోసం ఆమె చేసిన కృషిని ఎవరూ మర్చిపోరని స్టార్‌‌‌‌‌‌‌‌ జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రోయర్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ చోప్రా అన్నాడు. ‘వినేశ్ మెడలో పతకం లేకపోయినా అది ఆమె హృదయంలో ఉంటుంది. ఆమె అందరి హృదయాల్లో నిలిచిపోతుంది’ అని అభిప్రాయపడ్డాడు.