Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ముగిసిన పీవీ సింధు పోరాటం

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ముగిసిన పీవీ సింధు పోరాటం

ఒలింపిక్స్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం(ఆగష్టు 01) చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోతో జరిగిన రౌండ్ 16 పోరులో సింధు 19-21, 14-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలైంది. 

తొలి సెట్‌లో హోరాహోరీగా పోరాడిన సింధు కేవలం రెండు పాయింట్ల తేడాతో కోల్పోయింది. అయితే, రెండో సెట్‌లో చైనా క్రీడాకారిణి హీ బింగ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సింధు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. అంతకుముందు సింధు.. ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు (రౌండ్ -16) అర్హత సాధించింది.