Paris Olympics 2024: పతకం రేస్‌లో మరో ఇద్దరు.. మూడో రోజు భారత్ షెడ్యూల్ ఇదే

Paris Olympics 2024: పతకం రేస్‌లో మరో ఇద్దరు.. మూడో రోజు భారత్ షెడ్యూల్ ఇదే

విమెన్స్‌‌‌‌ 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌‌‌‌లో తన గురితో అదరగొట్టి పోడియంపైకి వచ్చిన మను.. విశ్వక్రీడల్లో పతకం గెలిచిన దేశ తొలి షూటర్‌‌‌‌‌‌‌‌గా చరిత్రకెక్కింది. మరో ఇద్దరు షూటర్లు రమిత జిందాల్‌‌‌‌, అర్జున్ బబూట ఫైనల్‌‌‌‌ చేరి నేడు (జూలై 29) దేశానికి పతకాలు సాధించడానికి సిద్ధమయ్యారు. పతక ఖాతా తెరవడంతో పాటు పలు ఈవెంట్లలో మెప్పించిన ఇండియా పోటీల రెండో రోజును సానుకూలంగా ముగించింది. మూడో రోజు భారత్ షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే..  
 
ఆర్చరీ: 

* పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్: తరుణ్‌దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్ -- సాయంత్రం 6:30గం.

బ్యాడ్మింటన్: 

పురుషుల డబుల్స్ (గ్రూప్ దశ): సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి vs మార్క్ లామ్స్‌ఫస్ మరియు మార్విన్ సీడెల్ (జర్మనీ) -- మధ్యాహ్నం 12గం.

* మహిళల డబుల్స్ (గ్రూప్ దశ): అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో vs నమీ మత్సుయామా మరియు చిహారు షిడా (జపాన్) -- మధ్యాహ్నం 12:50గం.

* పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): లక్ష్య సేన్ vs జూలియన్ కరాగ్గి (బెల్జియం) -- సాయంత్రం 5:30

షూటింగ్

* 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత: మను భాకర్, సరబ్జోత్ సింగ్; రిథమ్ సాంగ్వాన్ మరియు అర్జున్ సింగ్ చీమా -- 12:45 మధ్యాహ్నం

* పురుషుల ట్రాప్ అర్హత: పృథ్వీరాజ్ తొండైమాన్ -- మధ్యాహ్నం 1గం

* 10మీ ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్: రమితా జిందాల్ -- మధ్యాహ్నం 1గం

* 10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్: అర్జున్ బాబుత -- మధ్యాహ్నం 3:30

హాకీ

* పురుషుల పూల్ B మ్యాచ్: భారత్ vs అర్జెంటీనా -- సాయంత్రం 4:15గం

టేబుల్ టెన్నిస్

* మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 32): శ్రీజ అకుల vs జియాన్ జెంగ్ (సింగపూర్) -- రాత్రి 11:30గం.