పారిస్ ఒలింపిక్స్‌లో భారత మెన్స్ ఆర్చరీ టీమ్ నిరాశ పరిచారు. తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, బొమ్మదేవర ధీరజ్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. సోమవారం(జులై 29) టర్కీ టీమ్ మేటె గజోజ్, బెర్కిమ్ ట్యూమర్, అబ్దుల్లా యిల్డిర్మిస్లతో జరిగిన మ్యాచ్‌లో భారత బృందం నాలుగు సెట్లలో 53-57, 52-55, 55-54, 54-57 పాయింట్లు చేశారు. ఫలితంగా, ఫైనల్ స్కోరులో 2-6 తేడాతో ఓడారు. ఈ విజయంతో టర్కీ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
అంతకుముందు ఆదివారం అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారిలతో కూడిన భారత మహిళల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్లో 6-0తో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది.
🇮🇳 Result Update: India Men’s Archery Recurve Team Quarter-finals
— SAI Media (@Media_SAI) July 29, 2024
The trio of Dhiraj Bommadevara, Tarundeep Rai and Pravin Ramesh Jadhav lose in the quarterfinals stage of the 🇫🇷#ParisOlympics2024. pic.twitter.com/WWOP3HryRR