
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు దేశానికి మిశ్రమ ఫలితాలు అందాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లో షూటర్ మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించగా, డబుల్స్‌లో బ్యాడ్మింటన్ జోడి సాత్విక్-చిరాగ్, సింగిల్స్‌లో లక్ష్య సేన్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు హర్మీత్ దేశాయ్ తదుపరి రౌండ్లకు అర్హత సాధించారు. ఈ క్రమంలో రేపటి షెడ్యూల్ ఏంటి..? పతకం సాధించే వీరులు ఎవరెవరు బరిలో ఉన్నారనేది తెలుసుకుందాం..
భారత ఏస్ షట్లర్ పివి సింధు ఆదివారం(జూలై 28) తన ప్రచారాన్ని ప్రారంభించనుండగా, షూటర్ మను భాకర్ ఫైనల్‌లో పోటీపడనుంది.
ఆదివారం భారత షెడ్యూల్
బ్యాడ్మింటన్
- మహిళల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): పివి సింధు vs ఎఫ్‌ఎన్ అబ్దుల్ రజాక్ (మాల్దీవులు) - మధ్యాహ్నం 12.50 గంటలకు
- పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): ప్రణయ్ హెచ్‌ఎస్ vs ఫాబియన్ రోత్ (జర్మనీ) - రాత్రి 8.00 గంటలకు
షూటింగ్
- మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: ఎలవెనిల్ వలరివన్ - మధ్యాహ్నం 12.45 గంటలకు
- పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: సందీప్ సింగ్ మరియు అర్జున్ బాబుటా - మధ్యాహ్నం 2.45 గంటలకు
- మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మను భాకర్ - మధ్యాహ్నం 3.30 గంటలకు
రోయింగ్
- పురుషుల సింగిల్ స్కల్స్ (రిపీచేజెస్): బల్‌రాజ్ పన్వర్ - మధ్యాహ్నం 1.18 గంటలకు
టేబుల్ టెన్నిస్
- మహిళల సింగిల్స్ (రౌండ్ 2): శ్రీజ అకుల vs క్రిస్టినా కాల్‌బర్గ్ (స్వీడన్) - మధ్యాహ్నం 12.15 నుండి
- మహిళల సింగిల్స్ (రౌండ్ 2): మనికా బాత్రా vs అన్నా హర్సే (గ్రేట్ బ్రిటన్) - మధ్యాహ్నం 12.15 నుండి
- పురుషుల సింగిల్స్ (రౌండ్ 2): శరత్ కమల్ vs డెని కోజుల్ (స్లోవేనియా) - మధ్యాహ్నం 3.00 గంటల నుండి
బాక్సింగ్
- పురుషుల 51 కేజీలు: అమిత్ పంఘల్, రౌండ్ ఆఫ్ 32 - మధ్యాహ్నం 2:30 నుండి
- పురుషుల 71 కేజీలు: నిశాంత్ దేవ్, రౌండ్ ఆఫ్ 32 - మధ్యాహ్నం 3:02 నుండి
టెన్నిస్
1వ రౌండ్ మ్యాచ్‌లు:
- పురుషుల సింగిల్స్: సుమిత్ నాగల్
- పురుషుల డబుల్స్: రోహన్ బోపన్న మరియు ఎన్. శ్రీరామ్ బాలాజీ
స్విమ్మింగ్
- పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ (హీట్ 2): శ్రీహరి నటరాజ్ - మధ్యాహ్నం 3.16 గంటలకు
- మహిళల 200మీ ఫ్రీస్టైల్ (హీట్ 1): ధినిధి దేశింగు - మధ్యాహ్నం 3.30 గంటలకు
బాక్సింగ్
- మహిళల 50 కేజీలు: నిఖత్ జరీన్, రౌండ్ ఆఫ్ 32 - సమయం: సాయంత్రం 4:06 నుండి
ఆర్చరీ
- మహిళల జట్టు (క్వార్టర్-ఫైనల్): భారత్ (అంకితా భకత్, భజన్ కౌర్ మరియు దీపికా కుమారి) vs ఫ్రాన్స్/నెదర్లాండ్స్ - సాయంత్రం 5.45
- మహిళల జట్టు (సెమీ ఫైనల్స్): రాత్రి 7.17 గంటల నుంచి
- మహిళల జట్టు (పతక రౌండ్లు): రాత్రి 8.18 గంటల నుంచి.