
విశ్వక్రీడల్లో భారత్‌కు తొలి రోజే నిరాశ ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో దేశానికి చెందిన రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. శనివారం(జులై 27) జరిగిన షూటింగ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో రమిత-అర్జున్ బబుతా జోడీ జోడి ఆరో స్థానంతో(628.7 పాయింట్లు) నిలిచారు. అర్జున్ 314.2 పాయింట్లు సాధించగా, రమిత 314.5 పాయింట్లు సాధించింది. మరోవైపు సందీప్ సింగ్, ఎలవెనిల్ వలరివన్ 626.3 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. టాప్-4లో నిలిచిన వారు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తారు.
A fighting start to India’s #Shooting campaign at @Paris2024 👏🇮🇳 pic.twitter.com/ZZhp1jUzO5
— NRAI (@OfficialNRAI) July 27, 2024
అగ్రస్థానంలో చైనా
క్వాలిఫికేషన్ రౌండ్‌లో చైనా 632.2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణ కొరియా 631.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక 630.8 పాయింట్లతో కజకిస్తాన్ మూడో స్థానంలో నిలవగా.. 629.7 పాయింట్లతో జర్మనీ నాలుగో స్థానంలో నిలిచింది. స్వర్ణ పతక పోరులో చైనా దక్షిణ కొరియాతో తలపడగా, కాంస్య పతకం కోసం జర్మనీతో కజకిస్థాన్ తలపడనుంది.