
అథ్లెటిక్స్‌లో ఇండియా స్టీపుల్ ఛేజర్ అవినాశ్ సాబ్లే ఆకట్టుకున్నాడు. మెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా అవినాశ్ రికార్డు సృష్టించాడు. హీట్స్‌లో అతను 8ని, 15.43 సెకండ్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యాడు. మొత్తం 35 మంది పాల్గొన్న క్వాలిఫికేషన్స్‌లో సాబ్లే ఐదో ప్లేస్ సాధించాడు. మరోవైపు విమెన్స్ 400 మీటర్ల రేస్‌లో కిరణ్ పహల్ నేరుగా సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవడంలో ఫెయిలైంది. హీట్–5లో బరిలోకి దిగిన ఆమె 52.51 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి ఏడో ప్లేస్‌లో నిలిచింది. మంగళవారం జరిగే రెపిచేజ్ రౌండ్‌లో పహల్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.