Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. భారతీయుడిని ఓడించిన మరో భారతీయుడు

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. భారతీయుడిని ఓడించిన మరో భారతీయుడు

పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇద్దరు భారతీయులు తలపడాల్సి వచ్చింది. ఇందులో ఒకరు విజయం సాధించగా, మరొకరు ఓటమి పాలయ్యారు. గురువారం(ఆగష్టు 01) జరిగిన పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన లక్ష్య సేన్..  స్వదేశీయుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ను సునాయాసంగా ఓడించాడు. 

అది నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్య సేన్ 21-12, 21-6 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ గెలుపుతో సేన్ క్వార్టర్-ఫైనల్స్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ దశకు చేరుకున్న రెండవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. గతంలో 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో పారుపల్లి కశ్యప్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో క్వార్టర్స్ చేరుకున్నాడు.

సేన్ క్వార్టర్ ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన చెన్ చౌతో తలపడనున్నాడు. చెన్ చౌ ప్రీ క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన కోడై నారోకాను 21-12, 21-16 వరుస సెట్లలో ఓడించాడు.

రెండుగా చీలిన అభిమానులు

ఈ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులు ఎవరికీ మద్దతివ్వాలో తెలియని పరిస్థితి. కొందరు  లక్ష్య సేన్ విజయాన్ని కోరుకోగా.. మరికొందరుప్రణయ్‌కు జేజేలు కొట్టారు.