Paris Olympics 2024: మెరిసిన మను భాకర్.. ఒలింపిక్ పతకంపై ఆశలు!

Paris Olympics 2024: మెరిసిన మను భాకర్.. ఒలింపిక్ పతకంపై ఆశలు!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుష షూటర్ల నిరాశాజనక ప్రారంభం తర్వాత, మహిళా షూటర్ మను భాకర్ అదరగొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. 580 పాయింట్లతో మను పతక రౌండ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టాప్-8లో నిలిచినవారు ఫైనల్‌ పోరుకు అర్హత సాధిస్తారు.

మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ అర్హత ఫలితాలు

  • వెరోనికా మేజర్ (HUN): 582
  • ఓహ్ యే జిన్ (KOR): 582
  • మను భాకర్ (IND): 580
  • థు విన్ ట్రిన్ (VIE): 578
  • కిమ్ యేజీ (KOR): 578లి 
  • Xue (CHN): 577
  • సెవ్వల్ తర్హాన్ (TUR): 577
  • జియాంగ్ రాన్క్సిన్ (CHN): 577

నిరాశ పరిచిన పురుషులు 

మరోవైపు, శనివారం(జులై 27) జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లోనూ, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ విభాగంలోనూ భారత్‌కు భంగపాటు ఎదురైంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే భారత పురుష షూటర్లు వెనుదిరిగారు.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో రమిత-అర్జున్‌ బబుతా, సందీప్ సింగ్- ఎలవెనిల్ వలరివన్ టీమ్‌లు టాప్‌-4లో చోటు దక్కించుకోలేకపోయారు. అనంతరం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పురుషుల విభాగంలో సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.