ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లకే హైలైట్‌గా నిలిచే మెన్స్ 100 మీ. స్ప్రింట్ ఈవెంట్ అంచనాలకు మించిన ఉత్కంఠను రేపింది. ఫైనల్‌కు చేరుకున్న ఎనిమిది మంది అథ్లెట్లు మెరుపు వేగంతో ట్రాక్‌పై పరుగులు తీశారు. అనేక రీప్లేలు చూసినా పతక విజేతలు ఎవరో స్పష్టంగా తెలియలేదు. చివరకు ఫొటో ఫినిష్ ద్వారా విన్నర్‌ను తేల్చారు.
సెకండ్‌లో ఐదు వేల వంతు తేడాతో తన సమీప ప్రత్యర్థి కిషేన్ థాంప్సన్ (జమైకా)ను ఓడిస్తూ అమెరికా స్ప్రింటర్ నోవా లైల్స్ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అదివారం అర్ధరాత్రి జరిగిన ఈ పోటీలో లైల్స్ 9.79 (.784) సెకండ్లతో టాప్ ప్లేస్ సాధించగా.. కిషేన్ 9.79 (.789)సెకండ్లతో వెంట్రుకవాసిలో అగ్రస్థానం కోల్పోయి రజతం అందుకున్నాడు. అమెరికా అథ్లెట్ ఫ్రెడ్ కెర్లీ (9.81సె) కాంస్యం గెలిచాడు.