Paris olympics 2024: బ్రేకింగ్‌లో ఇండియా గెలిచింది

Paris olympics 2024:  బ్రేకింగ్‌లో ఇండియా గెలిచింది

పారిస్ ఒలింపిక్స్‌‌లో కొత్తగా చేర్చిన ఆటల్లో  బ్రేకింగ్ ఒకటి. ఇందులో  అబ్బాయిలు, అబ్బాయిలు బి–గర్ల్‌‌, బి, బి–బాయ్స్‌‌ అనే రెండు కేటగిరీల్లో తమ డ్యాన్సింగ్‌‌ టాలెంట్‌‌ను చూపెడుతున్నారు.  ఇందులో ఇండియాకు ప్రాతినిథ్యం లేదు. కానీ, శుక్రవారం మొదలైన ఈ పోటీల్లో ‘ఇండియా’ బరిలోకి దిగింది. ఒలింపిక్ బ్రేకింగ్ ఈవెంట్‌‌లో తొలి విజయం అందుకొని రికార్డు సృష్టించింది.

వ్యక్తిగత ఆటలో  జట్టు పోటీ పడటం ఎలా సాథ్యం? అందునా ఇండియా బరిలో ఉండటం ఏంటి? అన్న ప్రశ్నలు సహజం.  బ్రేకింగ్‌‌లో ఇండియా పోటీ పడుతున్నది వాస్తవం. కానీ, అది మన దేశం కాదు. మన దేశానికి చెందిన అథ్లెట్ కూడా కాదు. నెదర్లాండ్స్‌‌కు చెందిన ఓ అమ్మాయి. తన పేరే ఇండియా సర్జో. సాధారణంగా బ్రేకింగ్‌‌లో పోటీ పడుతున్న వాళ్లు మారు పేర్లతో బరిలోకి దిగుతుంటారు. కానీ, ఇండియా సర్జో తన ఒరిజినల్ పేరుతోనే పోటీ పడుతోంది. బి–గర్ల్‌‌ ఇండియా పోటీలోకి వచ్చిన తను శుక్రవారం మూడు బ్యాటిల్స్‌‌లో తన ప్రత్యర్థులపై గెలవడం విశేషం.