Paris Olympics 2024 : 400 మీ. హర్డిల్స్‌‌‌‌‌‌‌‌ చాంప్​ బెంజమిన్‌‌‌‌‌‌‌‌

Paris Olympics 2024 : 400 మీ. హర్డిల్స్‌‌‌‌‌‌‌‌ చాంప్​ బెంజమిన్‌‌‌‌‌‌‌‌

సెయింట్ డెనిస్ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌): అమెరికా స్ప్రింటర్ రాయ్ బెంజమిన్‌‌‌‌‌‌‌‌  టోక్యో ఒలింపిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌, వరల్డ్ రికార్డు హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌‌‌‌‌‌‌టెన్‌‌‌‌‌‌‌‌ వారోల్మ్‌‌‌‌‌‌‌‌ను ఓడిస్తూ మెన్స్‌‌‌‌‌‌‌‌ 400 మీటర్ల హర్డిల్స్‌‌‌‌‌‌‌‌ బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్ రేసును బెంజమిన్ 46.46 సెకండ్లలో పూర్తి చేసి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్ సాధించాడు.

అతనికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన నార్వే అథ్లెట్‌‌‌‌‌‌‌‌ కార్స్‌‌‌‌‌‌‌‌టెన్‌‌‌‌‌‌‌‌ 47.06 సెకండ్లతో రజతం గెలవగా.. బ్రెజిల్‌‌‌‌‌‌‌‌కు చెందిన అలీసన్‌‌‌‌‌‌‌‌ డొస్ శాంటోస్‌‌‌‌‌‌‌‌ 47.26 సెకండ్లలో కాంస్యం గెలుచుకున్నాడు. ఎనిమిదో హర్డిల్‌‌‌‌‌‌‌‌లో కింద పడిపోయినా.. వెంటనే లేచిన బెంజమిన్‌‌‌‌‌‌‌‌ ఈ రేసు నెగ్గడం విశేషం.