Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌.. ఫైనల్‌ బెర్త్ ఖాయం చేసుకున్న రమితా జిందాల్

 Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌..  ఫైనల్‌ బెర్త్ ఖాయం చేసుకున్న రమితా జిందాల్

పారిస్ ఒలింపిక్స్‌లో మొదటి రోజు నిరాశాజనకంగా నిలిచిన భారత క్రీడాకారులు.. రెండో రోజు పతకాల వేటలో నిలిచారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రమితా జిందాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం(జులై 28)  జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రమితా 631.5 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 8లో నిలిచిన వారు ఫైనల్స్‌కు చేరుకుంటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మను భాకర్ తర్వాత ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న భారత రెండవ షూటర్‌.. రమితా జిందాల్.  

బ్యాడ్మింటన్ 

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత భారత షట్లర్ పివి సింధు ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది.  21-9 21-6 తేడాతో వరుస సెట్లలో ఓడించి తదుపరి రౌండ్ కు అర్హత సాధించింది. 

రోయింగ్

భారత రోయింగ్ ఆటగాడు బల్‌రాజ్‌ పన్వర్‌ క్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. రెపెచేజ్ రౌండ్‌లో అతను 7:12.41 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు.

టేబుల్ టెన్నిస్

భారత టేబుల్ టెన్నిస్ స్టార్ శ్రీజ అకుల స్వీడన్‌కు చెందిన క్రిస్టినా కాల్‌బర్గ్‌ను ఓడించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో తన స్వీడిష్ ప్రత్యర్థిని చిత్తు చేసింది.