
భారత బ్యాడ్మింటన్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. సోమవారం(జులై 29) జర్మనీ జంట మార్క్ లామ్స్‌ఫస్- మార్విన్ సెయిడ్‌తో జరగాల్సిన వీరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ రద్దయ్యింది. చివరి నిమిషంలో లామ్స్‌ఫస్ మోకాలి గాయం కారణంగా డ్రా నుండి వైదొలిగాడు. దాంతో, భారత పురుషుల ద్వయం కోర్టులో అడుగుపెట్టకుండానే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు.
మరోవైపు, సోమవారం జరిగిన షూటింగ్ ఈవెంట్లలో భారత షూటర్లు నిరాశ పరిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అర్జున్ బాబుటా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పోటీ పడిన రమితా జిందాల్ 7వ స్థానంతో సరిపెట్టుకుంది.
??? ????? ???? ??? ?????? & ??????! Satwik & Chirag became the first doubles pair from India to advance to the quarter-finals in the Olympics, a monumental achievement for them.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 29, 2024
? Following Corvee/Labar's loss against Rian/Fajar, the Indian duo were… pic.twitter.com/SdvKO8MryP