
పారిస్: ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో షూటర్ మను భాకర్‌తో పాటు హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నారు. హాకీ టీమ్‌కు అతను అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ఇచ్చారు. జావెలిన్‌లో సిల్వర్ నెగ్గిన నీరజ్ చోప్రాతో చర్చించిన అనంతరం ఐవోఏ ఈ నిర్ణయం తీసుకుంది. హాకీకి గుడ్‌బై చెప్పిన శ్రీజేష్‌కు ఆ స్థాయి గౌరవం ఇవ్వాలని నీరజ్ కూడా కోరుకున్నాడని ఐవోఏ చీఫ్ పీటీ ఉష తెలిపారు.
‘ఈ విషయంపై నేను నీరజ్‌తో మాట్లాడా. ముగింపు వేడుకల్లో శ్రీజేష్ ఫ్లాగ్ బేరర్‌గా ఉండేందుకు అంగీకరించాడు. అతను తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఒకవేళ నన్ను అడగకపోయినా నేను శ్రీభాయ్ పేరునే సూచించేవాడిని అని చెప్పాడు. ఇది శ్రీజేష్‌పై నీరజ్‌కు ఉన్న అపారమైన గౌరవాన్ని సూచిస్తున్నది’ అని ఉష వ్యాఖ్యానించింది.