Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌.. సెమీస్‌లో ఓడిన భారత షట్లర్

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌.. సెమీస్‌లో ఓడిన భారత షట్లర్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఏస్ షట్లర్ లక్ష్యసేన్ నిరాశ పరిచాడు. ఆదివారం(ఆగష్టు 04) జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్య సేన్.. ప్రపంచ నెం. 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్‌‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 20-22, 14-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. 

తొలిసెట్‌లో హోరీహోరీగా తలపడిన లక్ష్యసేన్ కేవలం 2 పాయింట్ల తేడాతో సెట్ కోల్పోయాడు. ఒకానొక దశలో అధిపత్యం కనబరిచినప్పటికీ, దానిని నిలబెట్టుకోలేకపోయాడు. రెండో సెట్‌లోనూ అదే జరిగింది.  ప్రారంభంలో 7-0తో ఉన్నప్పటికీ, సెట్ కోల్పోయాడు. ఈ విజయంతో అక్సెల్సెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 

కాగా, లక్ష్యసేన్ కాంస్య పతకం పోరులో మలేషియా ఆటగాడు లీజీ జియాతో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ సోమవారం(ఆగష్టు 05) జరగనుంది.

రేపటికి నేను సిద్ధం

ఈ ఓటమిపై భారత షట్లర్ స్పందించాడు. "నేను కొంచెం ఓపికగా ఉండాల్సింది. ఇతర మార్గంలో వెళ్ళే కొన్ని విషయాలపై దృష్టి సారించాలి. మొత్తంమీద, ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. రేపటి పోరుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఫలితాన్ని మరచిపోండి. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే..' అని మ్యాచ్ అనంతరం లక్ష్య సేన్ చెప్పుకొచ్చాడు.