పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ అదరగొట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఈ భారత రెజ్లర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం(ఆగష్టు 06) జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్‌ను 7 - 5 తేడాతో ఓడించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
అంతకుముందు వినేశ్ పోగట్ 3-2తో జపాన్‌కు చెందిన యుయి సుసాకిని మట్టికరిపించి క్వార్టర్స్‌కు అర్హత సాదించింది. ఈ విభాగం ఫైనల్ ఇదే రోజు రాత్రి జరగనుంది. సెమీఫైనల్లో గబిజా డిలైట్ లేదా యుస్నీలిస్ లోపెజ్‌తో వినేశ్ ఫోగట్ తలపడనుంది.
🇮🇳🔥 𝗔𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝘁𝗼𝗽 𝘄𝗶𝗻 𝗳𝗼𝗿 𝗩𝗶𝗻𝗲𝘀𝗵 𝗣𝗵𝗼𝗴𝗮𝘁! Vinesh Phogat was brilliant once again, defeating Oksana Livach in the quarter-final in the women's freestyle 50kg category. Oksana applied pressure on Vinesh in the last minute but Vinesh Phogat showed her class… pic.twitter.com/QhZ4AFRRUr
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 6, 2024
ఇదిలా ఉంటే, జావెలిన్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. మంగళవారం(ఆగష్టు 6) జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ మొదటి ప్రయత్నంలోనే బల్లాన్ని 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.