ఒలింపిక్స్ లో సత్తా చాటిన భజన్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఒలింపిక్స్ లో సత్తా చాటిన భజన్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టీమ్‌ ఈవెంట్లో తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత వ్యక్తిగత విభాగంలో  ఆర్చర్లు భజన్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్తాచాటింది.  విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలిమినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భజన్ ప్రిక్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లగా..  మెన్స్ లో ధీరజ్ రెండో రౌండ్‌లో ఓడాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భజన్ 7–3తో ఇండోనేసియాకు చెందిన సుఫియా కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. కానీ, అంకిత 4–6తో పోలెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్చర్ వియొలెటా మైజోర్ చేతిలో ఓడిపోయింది.

రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో భజన్ 6–0తో మైజోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ ఎలిమినేషన్ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో ధీరజ్‌‌‌‌‌‌‌‌ 7–1తో ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌)పై విజయం సాధించాడు.  కానీ, తర్వాతి రౌండ్‌లో అతను 5–6తో కెనడా ఆర్చర్ ఎరిక్ పీటర్స్ చేతిలో ఓడాడు. తొలుత ఇరువురూ 5–5తో సమంగా నిలవగా.. షూటాఫ్‌లోనూ చెరో పది పాయింట్లు సాధించారు. కానీ, ఎరిక్‌ బాణం టార్గెట్‌కు దగ్గరగా ఉండటంతో అతనే గెలవగా.. ధీరజ్‌ ఇంటిదారి పట్టాడు.