ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈసారి ముక్క తక్కువే..

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే అథ్లెట్లు ఈసారి తిండి విషయంలో కాస్త రాజీ పడాల్సిందే. కర్బన ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈసారి గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాంసం (మటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఛీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఆహార పదార్ధాలను భారీగా తగ్గించారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహారం, వ్యవసాయ సంస్థ నియమాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60 శాతం వెజిటేరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేలా ఏర్పాట్లు చేశారు.

దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా దొరికే పండ్లను అందుబాటులో ఉంచారు. ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​ విజ్ఞప్తి మేరకు మన అథ్లెట్లకు పప్పు, రోటీ ఆలూ–గోబీ, చికెన్​ కర్రీని అందించనున్నారు. అయితే ఫ్రెంచ్​ వంటకాలు మాత్రం హైలెట్​గా నిలవనున్నాయి.  ఇక అథ్లెట్లు పడుకునే బెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా మార్చారు. టోక్యోలో శృంగారానికి అనువుగా లేని బెడ్లను ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈసారి బెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేశారు.