మను భాకర్ మనసు మార్చిన భగవద్గీత

మను భాకర్ మనసు మార్చిన భగవద్గీత

మను భాకర్‌‌‌‌‌‌‌‌.. గత కొన్నేండ్లుగా ఇండియా షూటింగ్‌‌‌‌లో దూసుకెళ్తున్న యంగ్‌‌‌‌స్టర్.  టోక్యో గేమ్స్‌‌‌‌లో భారీ అంచనాలతో బరిలోకి నిరాశ పరిచిన మను తన పిస్టల్‌‌‌‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌‌‌లో కన్నీళ్లతో వెనుదిరిగింది. మూడేళ్లు తిరిగే సరిగే సరికి ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి మెడల్ అందించడంతో పాటు ఒలింపిక్ మెడలిస్ట్‌‌‌‌గా నిలిచిన దేశ తొలి మహిళగా పేరు తెచ్చుకుంది. మనసు పెట్టి ప్రయత్నిస్తే విజయం మనసొంతం అవుతుందని నిరూపించింది. బాక్సర్లు, రెజ్లర్లకు పేరుగాంచిన హర్యానాలోని ఝజ్జర్‌‌‌‌లో జన్మించిన మను భాకర్ షూటింగ్‌‌‌‌ను కెరీర్‌‌‌‌‌‌‌‌గా ఎంచుకోవడమే అనూహ్యం. స్కూల్ డేస్‌‌‌‌లో తను టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో పోటీ పడింది.

 'తంగ్ టా' అనే మార్షల్ ఆర్ట్స్‌‌‌‌లోనూ  పాల్గొని నేషనల్‌‌‌‌ లెవెల్‌‌‌‌లో మెడల్స్ సాధించింది. కానీ, ఈ ఆటలేవీ ఆమెకు కిక్‌‌‌‌ ఇవ్వలేదు. 2016 రియో​ఒలింపిక్స్ ముగిసిన తర్వాత  మను షూటింగ్‌‌‌‌పై మనసు పారేసుకుంది. అప్పటికి ఆమె వయసు 14 ఏండ్లు. సాధారణంగా ఏ ఆటను ప్రారంభించినా పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ, షూటర్ అవ్వాలని డిసైడైన ఏడాదికే మను తన పేరు ఇండియాలో మార్మోగేలా చేసింది. 2017 నేషనల్ షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో మాజీ వరల్డ్  నంబర్ 1 హీనా సిద్ధూకు షాకిచ్చి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ గోల్డ్ నెగ్గి ఔరా అనిపించింది. 2018  షూటర్‌‌‌‌గా మను కెరీర్‌‌‌‌‌‌‌‌ మరో ఎట్టు ఎక్కింది. 16  ఏండ్ల ఏజ్‌‌‌‌లోనే కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ నెగ్గిన ఆమె టీనేజ్‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌గా మారింది. అదే జోరును వరల్డ్‌‌‌‌ కప్స్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌లోనూ కొనసాగించి పతకాల మోత మోగించడంతో ఇండియా షూటింగ్‌‌‌‌లో మను పేరు మార్మోగింది.  

భగవద్గీత చదువుతూ..

2019 మ్యూనిచ్ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నాలుగో ప్లేస్‌‌‌‌లో నిలిచి టోక్యో ఒలింపిక్స్ కోటా దక్కించుకున్న మను 19 ఏండ్లకే కోటి ఆశలతో టోక్యోలో అడుగు పెట్టింది. కానీ, మూడు ఈవెంట్లలోనూ కనీసం ఫైనల్‌‌‌‌ కూడా చేరుకోలేకపోయింది. క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్ మధ్యలో పిస్టల్‌‌‌‌ మొరాయించడంతో 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ఫైనల్ బెర్తు కోల్పోయింది. దాంతో అరంగేట్ర ఒలింపిక్స్‌‌‌‌  ఆమెకు చేదు జ్ఞాపకంగా మారాయి.  ఆ బాధ నుంచి తేరుకునేందుకు తనకు ఏడాది సమయం పట్టింది. ఓ దశలో భాకర్ ఈ ఆటనే వదిలేద్దామని అనుకుంది. షూటింగ్‌‌‌‌ను పక్కనబెట్టి సివిల్స్‌‌‌‌కు ప్రిపేర్ అవ్వాలని భావించింది.  

అయితే, మానసిక ప్రశాంతత కోసం భగవద్గీత చదవడం ప్రారంభించిన ఆమె మనసు మార్చుకొని పారిస్ ఒలింపిక్స్‌‌‌‌పై ఫోకస్ పెట్టింది. కర్మ సిద్ధాంతంపై నమ్మకం పెంచుకున్న ఆమె తన ప్రయత్నంలో ఏలోపం లేకుండా చూసుకుంటూ ముందుకు సాగింది.  ఈ క్రమంలో విమెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌‌‌‌లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌‌‌‌గా నిలవడంతో పాటు 2022 కైరో వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో 25 మీటర్ల పిస్టల్ సిల్వర్‌‌‌‌‌‌‌‌, గతేడాది ఆసియా గేమ్స్‌‌‌‌ టీమ్ ఈవెంట్‌‌‌‌లో  మరో గోల్డ్‌‌‌‌ నెగ్గి మళ్లీ గాడిలో పడింది. అన్నింటికి మంచి గత ఒలింపిక్స్‌‌‌‌లో మూడు ఈవెంట్లలో పోటీ వద్దన్నందుకు  మేటి కోచ్‌‌‌‌ జస్‌‌‌‌పాల్‌‌‌‌ రాణాతో విడిపోయిన మను.. తిరిగి ఆయనతో జట్టు కట్టడం ప్లస్ పాయింట్ అయింది. మను ఆటలో ఏ లోపం లేకపోయినా.. తనను మానసికంగా మరింత బలోపేతం చేయడంపై రాణా ఫోకస్ పెట్టాడు. అది అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.  పడ్డ చోటనే పైకి లేవాలి.. పోగొట్టుకున్న  చోటే వెతుక్కోవాలని అన్నట్టుగా.. మూడేండ్ల కిందట తీవ్ర నిరాశతో తలదించుకున్న ఒలింపిక్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ రేంజ్‌‌‌‌లో పతకం సాధించి త్రివర్ణ పతాకం పైకి ఎగురుతుండగా భాకర్ సగర్వంగా తలెత్తుకున్నది. 

పారిస్‌‌లో బ్రాంజ్ మెడల్‌‌‌‌ నెగ్గినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌‌‌‌ షూటింగ్‌‌‌‌లో  మెడల్ కోసం ఇండియా చాలా కాలం నుంచి ఎదురు చూస్తోంది. దాన్ని సాధించినందుకు ఈ రోజు నేనెంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఫైనల్ చివరి షాట్‌‌‌‌లో నా శక్తి మొత్తం ధారపోసి పోరాడాను. చివరికు బ్రాంజ్ గెలిచా. టోక్యో  ఒలింపిక్స్‌‌‌‌ తర్వాత నేను ఎంతో  నిరాశకు గురయ్యా. ఆ బాధ నుంచి కోలుకోవడానికి  చాలా సమయమే పట్టింది. నేను భగవద్గీత చదువుతా. అందులో చెప్పినట్టు నేను చేయాల్సిన పనిని అంతా చేసి మిగిలినదంతా 
ఆ భగవంతుడికే వదిలివేస్తా. మనం విధితో పోరాడలేము. ఫలితాన్ని మార్చలేము. కాబట్టి మన శక్తి మేరకు పోరాడుతూ ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి
- మను భాకర్‌‌‌‌‌‌‌‌