
పారిస్: సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్... ఒలింపిక్స్‌లో నాలుగోసారి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జొకో 7–5, 6–3తో డొమ్నిక్ కొఫెర్ (జర్మనీ)పై గెలిచాడు. 2008 బీజింగ్‌లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన జొకో ఈసారి పతకం రంగు మార్చాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
1988 తర్వాత ఒలింపిక్ టెన్నిస్‌లో నాలుగుసార్లు క్వార్టర్స్ చేరిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. టెన్నిస్ హిస్టరీలో దాదాపు అన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్న సెర్బియా ప్లేయర్‌కు ఈసారి ఒలింపిక్ టెన్నిస్ మ్యాచ్‌లు రోలాండ్ గారోస్‌లో జరుగుతుండటం బాగా కలిసి వస్తోంది. ఇక్కడ మూడుసార్లు ఫ్రెంచ్ టైటిల్ గెలిచాడు. గురువారం జరిగే క్వార్టర్స్‌లో జొకో.. స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్)తో తలపడనున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో సిట్సిపాస్ 7–5, 6–1తో సెబాస్టియన్ బీజ్ (అర్జెంటీనా)ను ఓడించి ముందంజ వేశాడు.