Paris olympics2024: మాజీ వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శరణార్థి బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Paris olympics2024: మాజీ వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శరణార్థి బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విల్లెపింటె (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంచలన ఫలితం వచ్చింది.  శరణార్థుల ఒలింపిక్ టీమ్ తరఫున బరిలోకి దిగిన ఓ బాక్సర్.. ఏకంగా మాజీ వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  చిత్తు చేసింది. ఆ శరణార్థి బాక్సర్ పేరు సిండీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంబ. కామెరూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన తను ఈ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శరణార్థుల జట్టులో బరిలో నిలిచింది.

అయితేనేం తొలి బౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తన పేరు ఒలింపిక్స్ మొత్తం మార్మోగేలా చేసింది. బుధవారం జరిగిన 75 కేజీ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిండీ 3–2తో 2022 వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమార థిబ్యూల్ట్ (కెనడా)ను ఓడించి ఔరా అనిపించింది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఆమె ఒలింపిక్ శరణార్థుల జట్టుకు తొలి పతకం అందించేందుకు మరొక్క విజయం దూరంలో నిలిచింది. ఆదివారం జరిగే క్వార్టర్స్ బౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిండీ ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన డెవినా మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది.