Paralympics 2024: చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా.. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

Paralympics 2024: చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా.. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత పారా పారా షూటర్‌ అవనీ లేఖరా అద్భుతం చేసింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత పారా షూటర్ మోనా అగర్వాల్‌ కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.

అవనీ లేఖరాగోల్డ్ మెడల్ సాధించడం వరుసగా ఇది రెండోసారి. 2020లో జరిగిన టోక్యో  పారాలింపిక్స్‌లోనూ ఆమె పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు 249.6 పాయింట్లతో ఉన్న గత పారాలింపిక్స్ రికార్డును 249.7తో మెరుగుపరుచుకుంది.

ALSO READ | వరదల్లో చిక్కుకున్న భారత మహిళా క్రికెటర్.. కాపాడిన NDRF సిబ్బంది

అవనీ లేఖరా 2012లో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు ఆమె వయసు 11 సంవత్సరాలు. కారు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో పక్షవాతం వచ్చి చక్రాల కుర్చీకి పరిమితమైంది.