
- 28 నుంచి గేమ్స్.. బరిలో 84 మంది
న్యూఢిల్లీ : టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రోయర్), రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ (షాట్‌ఫుట్).. పారిస్ పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో పతాకధారులుగా వ్యవహరించనున్నారు. ‘గత కొన్నేళ్లుగా సుమిత్, జాదవ్ పెర్ఫామెన్స్ నిలకడగా ఉంది. అందుకే అథ్లెట్ల మార్చ్ పాస్ట్‌లో వీళ్లను పతాకధారులుగా తీసుకున్నాం’
అని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) చీఫ్ దేవేంద్ర జజారియా వెల్లడించారు. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే పారాలింపిక్స్‌లో ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. శుక్రవారం పీసీఏ, సాయ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఇండియా అథ్లెట్ల బృందం పారిస్‌కు
బయలుదేరి వెళ్లింది.