Sachin Khilari: పారాలింపిక్స్‌.. స‌చిన్ ఖిలారికి సిల్వ‌ర్ మెడల్

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌46 విభాగంలో భారత అథ్లెట్ సచిన్ సర్జేరావు ఖిలారీ రజత పతకం సాధించాడు. బుధవారం(సెప్టెంబర్ 04) జరిగిన పురుషుల షాట్‌పుట్‌ పోటీల్లో స‌చిన్ ఖిలారి షాట్‌పుట్‌ను 16.32 మీటర్ల దూరం విసిరిన రెండో స్థానంలో నిలిచాడు. 30 ఏళ్ల పారాలింపిక్స్‌లో దేశానికి షాట్‌పుట్‌ విభాగంలో ప‌త‌కం రావ‌డం ఇదే తొలిసారి.

ఇదే విభాగంలో పోటీపడిన మరో ఇద్దరు భారత అథ్లెట్లు మహ్మద్ యాసర్, రోహిత్‌ కుమార్‌ వరుసగా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. 

పురుషుల షాట్‌పుట్ F46 ఈవెంట్  ఫలితాలు

  • గ్రెగ్ స్టీవర్ట్ (కెనడా)- గోల్డ్ మెడల్
  • స‌చిన్ ఖిలారి(ఇండియా)- సిల్వ‌ర్ మెడల్
  • లుకా బకోవిచ్ (క్రొయేషియా)- బ్రాంజ్ మెడల్

అమిత్ షా అభినందనలు

పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సచిన్ ఖిలారీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ విజయం యువ క్రీడాకారుల్లో యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుందని ప్రశంసించారు.