పారిస్ లో మొన్న వాన..  ఇప్పుడు వేడి

పారిస్ లో  మొన్న వాన..  ఇప్పుడు వేడి

పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతికూల వాతావరణం అథ్లెట్లు. ఆర్గనైజర్లకు ఇబ్బంది తెచ్చిపెడుతోంది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెర్మనీ సమయంలో భారీ వర్షంతో అథ్లెట్లు, ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు. అయితే, మొన్న వానతో ఇబ్బంది పడ్డ వాళ్లంతా ఇప్పుడు వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం వేడి గాలులు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. వాతావరణ శాఖ పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా ప్రాంతాలకు వేడి గాలుల హెచ్చరిక ఇచ్చింది. సాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలు జరుగుతున్న మార్సెల్లే సిటీలో ఉష్ణోగ్రతలు  40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒలింపిక్ విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏసీలు లేక ఇబ్బంది పడుతున్న అథ్లెట్లకు ఇప్పుడు వడ గాల్పులు దడ పుట్టించనున్నాయి.