సంగారెడ్డి ఎస్పీగా పరితోష్ పంకజ్

సంగారెడ్డి ఎస్పీగా పరితోష్ పంకజ్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2020 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన పంకజ్ కొత్తగూడెం ఓఎస్డీగా పని చేస్తూ సంగారెడ్డి జిల్లాకు ఎస్పీగా బదిలీ అయ్యారు.

ఇప్పటివరకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన చెన్నూరి రూపేశ్ ను యాంటీ నార్కోటిక్ విభాగం ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా బదిలీపై వెళ్లనున్న రూపేశ్  2023 అక్టోబర్ 13న సంగారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఇప్పటివరకు కొనసాగారు. జిల్లాలో ఇంత కాలం పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కోసం చేసిన పని మర్చిపోలేనని ఎస్పీ రూపేశ్ తెలిపారు.