
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2020లో ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనది బిహార్. గతంలో భద్రాచలం అదనపు ఎస్పీగా, భద్రాద్రి, కొత్తగూడెం ఓఎస్డీగా పనిచేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్యూటీ పరంగా, పర్సనల్‌గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. శాంతిభద్రతల రక్షణలో జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటామన్నారు. అదనపు ఎస్పీ సంజీవరావు, ఏవో కల్యాణి, డీఎస్పీలు రవీందర్ రెడ్డి, సత్తయ్యగౌడ్, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏఆర్‌డీ ఎస్‌పీ నరేందర్, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా జడ్జి భవాని చంద్రను వారి చాంబర్లలో ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు.