పార్క్ ప్లస్ రీసెర్చ్​ ల్యాబ్ ​షురూ

పార్క్ ప్లస్  రీసెర్చ్​ ల్యాబ్ ​షురూ

హైదరాబాద్​, వెలుగు : పట్టణాలలో పార్కింగ్ సమస్యలను పరిష్కరించడానికి వినూత్నమైన టెక్నాలజీని అందించే పార్క్ ప్లస్ తన రీసెర్చ్ ల్యాబ్‌‌‌‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.  ఈ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త పార్కింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి, పార్కింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సైంటిస్టులు, ఇంజనీర్లు కలిసి పనిచేస్తారు.  

కార్ల యజమానులకు, వాటాదారులకు మధ్య నేరుగా బంధాన్ని ఏర్పరచడానికి పార్క్ ప్లస్ రీసెర్చ్ ల్యాబ్ లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కంపెనీ తెలిపింది. యాజమాన్య అనుభవాలు, డిమాండ్లను గుర్తించడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది