
- జీఓ 63 తర్వాత.. జీఓ121ను తెచ్చిన బీఆర్ఎస్సర్కార్
- సింగిల్స్క్రీన్థియేటర్లకు మినహాయింపు
- దీన్ని ఆసరాగా తీసుకున్న రెచ్చిపోతున్న పార్కింగ్ మాఫియా
- హైకోర్టులో వచ్చేవారం హియరింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరంలోని కార్పొరేట్ హాస్పిటల్స్, నిమ్స్ దవాఖాన, షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ లలో మాత్రమే కాకుండా బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలోనూ పార్కింగ్ ఫీజుల పేరిట దండుకుంటున్నారు. 2018లో పార్కింగ్దోపిడీని నిరోధించేందుకు తెచ్చిన జీఓ 63లో, 2021లో కొందరికి వెసులుబాటు ఇస్తూ ఇచ్చిన 121 జీఓలో మెట్రో రైల్, ఆర్టీసీ బస్టాండ్ల ప్రస్తావన లేకపోవడంతో అందినకాడికి దోచుకుంటున్నారు.
ఎన్ని గంటలకు ఎంత తీసుకోవాలన్న దానిపై జీఓల్లో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇష్టమున్న రేట్లు వసూలు చేస్తున్నారు. బస్టాండ్లలో టూవీలర్ కి గంటకు రూ.10, గంట నుంచి 4 గంటల వరకు రూ.30, నాలుగు నుంచి 24 గంటల వరకైతే రూ.50 తీసుకుంటున్నారు. ఫోర్ వీలర్ కి గంటకి రూ.20, గంట నుంచి 4గంటల వరకు రూ.50, నాలుగు నుంచి 24 గంటల వరకైతే రూ.75 వసూల్ చేస్తున్నారు. నాలుగు గంటల తర్వాత 24 గంటల వరకు మధ్యలో 6 గంటలు, 12 గంటలు, 18 గంటలు పెట్టకుండా 24 గంటలకు వసూలు చేస్తున్నారు.
46 మెట్రో స్టేషన్లలో ఇలా.. మెట్రో స్టేషన్లలో టూవీలర్‌కి 2 గంటల్లోపు రూ.10,
2 నుంచి 3 గంటలకు రూ.15, మూడు నుంచి 4 గంటలైతే రూ.20, 4 నుంచి 12 గంటలైతే రూ.25 తీసుకుంటున్నారు. ఫోర్ వీలర్ అయితే 2 గంటల్లోపు రూ.30, రెండు నుంచి 3 గంటలకు రూ.45, మూడు నుంచి 4 గంటలైతే రూ.60, నాలుగు నుంచి 12 గంటలైతే రూ.75 కలెక్ట్ చేస్తున్నారు. 12 గంటలు దాటితే టూ వీలర్ అయితే గంటకు రూ.5, అదే ఫోర్ వీలర్ కు గంటకి రూ.10 వసూలు చేస్తున్నారు. నగరంలో 57 మెట్రో స్టేషన్లుండగా ఇందులో 46 మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారు. మిగతా11 చోట్ల పార్కింగ్ సౌకర్యమే లేదు. ఫీజు కలెక్ట్ చేస్తున్న దగ్గర కూడా కనీసం షెడ్లు లేకపోవడం, హెల్మెట్లు ఎత్తుకుపోతుండడంతో వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు.
జీఓ 121 చాటున దందా..
జీఓ 63 ప్రకారం మొదటి అరగంట ఫ్రీగా, తర్వాత అరగంట నుంచి గంట వరకు ఎంత బిల్లు చేసినా ఉచితం అంటూ జీఓ ఇచ్చారు. గంట తర్వాత ఎంతసేపు బండి పెట్టినా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా బిల్లు చేస్తే ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని మెన్షన్ చేశారు. అయితే, 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ మంత్రిని సింగిల్స్క్రీన్ థియేటర్యజమానులు కలవగా ఆయన పార్కింగ్ ఫీజు తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ జీఓ నంబర్121 ఇప్పించారు. ఈ జీఓ ఉద్దేశం కేవలం సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మాత్రమే కాగా, దీన్ని సాకుగా చూపిస్తూ అందరూ మళ్లీ పార్కిం గ్ దందాకు తెరతీశారు.
బేగంపేటలోని వైట్ హౌస్, సికింద్రాబాద్ సిటీసీతో పాటు చార్మినార్ లోని పలు షాపింగ్ కాంప్లెక్స్ లలో బహిరంగంగానే పార్కింగ్‌ఫీజు తీసుకుంటున్నారు. ఇక్కడ టూవీలర్ కి మినిమం రూ.20, ఫోర్ వీలర్ అయితే రూ.వంద వరకు కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఫీజులు కలెక్ట్ చేస్తున్న చాలా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. షెడ్లు కూడా వేయకపోవడంతో బైక్స్ ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. హెల్మెట్లు పోతే సంబంధం లేదని, బండి ఓనర్లదే బాధ్యత అని తప్పించుకుంటున్నారు.హెల్మెట్‌కు కూడా గంటకు ఇంత అంటూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల బైకులు, కార్లలో పెట్రోల్ ట్యాంక్ లు ఖాళీ చేస్తున్నారు. పార్క్చేసిన వెహికల్ఎత్తుకుపోయినా తమది బాధ్యత కాదని చెప్తున్నారు.
హైకోర్టులో పిటిషన్ వేశాం
పార్కింగ్ దందా కొనసాగడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. జీఓ 63 ఉండగా, మళ్లీ జీఓ 121 తీసుకురావడంతోనే మళ్లీ పార్కింగ్ మాఫియా తయారైంది. కుటుంబాలతో బస్టాండ్లు, కాంప్లెక్స్‌లకు వెళ్లిన వారు పార్కింగ్ ఫీజు కోసం గొడవ ఎందుకని వదిలేస్తున్నారు. జీవో 121 కి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేశాం. వచ్చే వారంలో హియరింగ్ ఉంది. ఉన్నత న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నా...– విజయగోపాల్, హైకోర్టు అడ్వకేట్, ప్రెసిడెంట్, ఫోరం అగైనిస్ట్ కరప్షన్
ఎక్స్‌లో ‘వెలుగు’ కథనం
వెలుగు దినపత్రికలో శుక్రవారం ‘దవాఖానల్లో పార్కింగ్ దందా’ పేరిట పబ్లిష్చేసిన కథనాన్ని పలువురు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాజశేఖర్అనే వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ట్యాగ్‌చేశారు. దీన్ని ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ విజయ్గోపాల్రీ ట్వీట్ చేశారు. వెలుగు కథనంపై స్పందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మితో పాటు ఎంఏయూడీ, బల్దియా అధికారులకు ట్యాగ్‌చేశారు. ‘నిద్ర పోతున్న మీ శాఖల తీరుతో ఈ క్యాన్సర్ మళ్లీ సొసైటీలోకి వస్తోంది’ అంటూ కామెంట్ చేశారు.