
అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళకి పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. అదే కాన్సెప్ట్ గా తీసుకొని దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించిన మూవీ పార్కింగ్. వినూత్న కథతో వచ్చిన ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇందూజ రవిచంద్రన్, ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు తదితరులు నటించారు. ఈ సినిమా డిసెంబర్ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీకి కూడా వచ్చేసింది. డిసెంబర్ 29 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి సినిమా ఎలా ఉంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఈశ్వర్(హరీష్ కళ్యాణ్) ఓ ఐటీ ఎంప్లాయ్ అతని భార్య ఆతిక (ఇందూజ రవిచంద్రన్). పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటారు. బ్రోకర్ ఏకరాజ్ (ఎం.ఎస్. భాస్కర్) ద్వారా ఇంటికి అద్దె ఇంట్లో దిగుతారు. సాఫ్ట్ వేర్ జాబ్, మంచి జీతం, భార్యతో ఆనందమైన జీవితం గడుపుతూ ఉంటాడు ఈశ్వర్. అయితే అతను ఉండే ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏకరాజ్ కుటుంబం ఉంటుంది.
ఒకరోజు ఈశ్వర్ కారు కొనాల్సి వస్తుంది. దీంతో ఏకరాజ్ బైక్ కి, ఈశ్వర్ కారుకి పార్కింగ్ సమస్య వస్తుంది. ఇక అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంటి ఓనర్ కూడా ఈశ్వర్ కుక్ సపోర్ట్ చేస్తాడు. దీంతో ఎకరాజ్ బైక్ అనే కారణంగానే తనను చిన్న చూపు చూస్తున్నారని ఈగోతో కారు కొంటాడు. దానివల్ల వాళ్లకి ఎలాంటి సమస్య ఎదురైంది? పార్కింగ్ పై ఎవరి ఆధిపత్యం నడుస్తుంది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
పార్కింగ్ అనేది సాధారణంగా అందరికి ఉండే సమస్యే. అందుకే ఈ సినిమాకు ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు. అలాంటి కథను అంతే సహజంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్. సినిమా చూస్తున్నంతసేపు ఎదో మన ఇంటిపక్కనే జరుగుతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఈ కథలో ఈశ్వర్, ఏకరాజ్ ఇద్దరు మంచి వాళ్ళే కానీ.. పరిస్థితులను బట్టీ వాళ్ళు మారిపోయే తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. లంచం తీసుకోవడం కూడా నచ్చని మంచి మనిషి.. ఒకరిని చంపేయడానికి సిద్దమవుతాడు. అదే కథను ఆసక్తికరంగా మార్చింది.
ఇద్దరిలో ఒకరిది తప్పు అనుకునే లోపే మరొకరిని బ్యాడ్ గా ప్రూవ్ చేశాడు దర్శకుడు. ఈగోలకి వెళ్లి ఫ్యామిలీలను సైతం రోడ్డున పడేస్తాయారు. చివరకు తప్పు తెలుసుకుంటారు. ఆ అంశాలను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఫైనల్ గా ఎవరు తప్పు అని ప్రూవ్ చేశారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇక టెక్నీకల్ విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కూడా కథ డామినేట్ చేస్తుంది. కమర్షియల్, థ్రిల్లర్ సినిమా చూసి బోర్ కొట్టింది అనుకునేవారు ఈ సినిమా చూడొచ్చు.