- మెయిన్ సెంటర్లలో వెహికల్స్ అపవద్దంటూ నో పార్కింగ్ బోర్డులు
- ఫైన్లతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్లు, ప్రధాన కూడళ్లలో వెహికల్స్ పార్కింగ్ కష్టాలు ఎదురవుతున్నాయి. రోడ్లపై వెహికల్స్ అపవద్దంటూ పోలీసు నో పార్కింగ్ బోర్డులు పెడుతున్నారు. పని మీద వచ్చిన వ్యక్తులు వెహికిల్ అపిన వెంటనే పోలీసులు ఫైన్లు వేస్తున్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయటంలో మున్సిపల్ అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం కొరవడింది.
షాపుల ఎదుట, కమర్షియల్ బిల్డింగ్స్ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం లేకపోయినా .. పోలీసులు వెహికల్స్ కు ఫైన్లు వేస్తున్నారు. కూరగాయల మార్కెట్ ఏరియాల్లో రోడ్లపై నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసి వెహికిల్స్ ఆపనివ్వటం లేదు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయటానికి వచ్చిన వారు తమ వెహికిల్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
గుర్తించి వదిలేశారు...
జిల్లా కేంద్రంలో పార్కింగ్ కోసం గతంలో ఆయా చోట్ల 15 వరకు స్థలాలు గుర్తించారు. కానీ ఈ పక్రియ ఇప్పటికీ ముందుకెళ్లలేదు. సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, జేపీఎన్ రోడ్డు, మాయబజార్, సిరిసిల్లారోడ్డు, స్టేషన్ రోడ్డు, పాత హైవే రోడ్డులో వ్యాపార సంస్థలు, కూరగాయల మార్కెట్ వంటివి ఉన్నాయి. డెయిలీ మార్కెట్ తిలక్‌రోడ్డు పక్కన ఉంటుంది. కూరగాయలు అమ్మేందుకు గ్రామాల నుంచి రైతులు వస్తారు. డెయిలీ మార్కెట్ వద్ద వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ లేదు. తిలక్‌రోడ్డు, సుభాష్‌రోడ్డులో మధ్యలో తమ వెహికల్స్ అపి షాపులకు, కూరగాయల మార్కెట్‌కు వెళ్తారు.
ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని పోలీసులు రోడ్డు మధ్యలో వెహికల్స్ పార్కింగ్ చేయనివ్వట్లేదు. జిల్లా కేంద్రంలో పార్కింగ్ కోసం 6 ఏండ్ల క్రితం పోలీసు శాఖ స్థలాలు గుర్తించారు. ఇక్కడ పార్కింగ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు లేఖలు రాశారు. కానీ ఏండ్లు గడుస్తున్నా పట్టించుకున్న వాళ్లు లేరు. భగత్‌సింగ్ నగర్, గంజు హైస్కూల్, పాత బస్టాండు, సిరిసిల్లారోడ్డు, కొత్త బస్టాండు, నిజాంసాగర్ చౌరస్తా తదితర ఏరియాల్లో 15 వరకు స్థలాలు గుర్తించారు. ఆ తర్వాత పోలీసు, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటంతో ఈ పక్రియ మూలన పడింది.
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లపై వెహికిల్స్ అపకుండా చర్యలు తీసుకుంటున్నాం. తిలక్‌రోడ్డు, సుభాష్ రోడ్డులో కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు రోడ్లపై కాకుండా గంజులో పెట్టుకోవాలని సూచించాం. పార్కింగ్ స్థలాలు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేయాలి. చంద్రశేఖర్‌రెడ్డి, టౌన్ సీఐ