కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ సమీపంలో ఓ వ్యక్తి పార్కింగ్ సిబ్బందిని పిస్టల్‌తో బెదిరించాడు. చందానగర్‌కు చెందిన నక్క నర్సింహ(51) కూకట్ పల్లి కోర్టు వద్ద తన సొదరుడితో కలిసి పార్కింగ్లోపని చేస్తున్నాడు.
శుక్రవారం ఉదయం డ్రైవర్‌తో కలిసి తన కారు (ఏపీ39ఎఫ్‌క్యూ7117)లో అక్కడికి వచ్చిన చిదంబర్రెడ్డిని నర్సింహ ఆపాడు. వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ వైపు మళ్లించాలని సూచించాడు. దీంతో ‘నన్నే ఆపుతావా’ అంటూ కారులోని పిస్టల్ తీసి చిదంబర్‌రెడ్డి అతడిని బెదిరించాడు. భయంతో నర్సింహ పక్కకు జరగగా, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.